(Local) Mon, 26 Aug, 2019

పూర్తి స్థాయి బడ్జెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

August 11, 2019,   6:13 PM IST
Share on:

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-20 పూర్తిస్థాయి బడ్జెట్‌ను సెప్టెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. మున్సిపల్ ఎన్నికలు ఈ నెలఖారులోగా ముగిస్తే వచ్చే నెల తొలివారం, ఒకవేళ ఆలస్యమైతే రెండో వారంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించి, పద్దులను ఆమోదించనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామక్రిష్ణరావు అన్ని శాఖల అధిపతులకు తాజాగా లేఖ రాశారు. ప్రతి శాఖలో గత ఐదేళ్లలో జరిగిన ప్రగతి నివేదికలతో పాటు కొత్త పథకాలపై కూడిన సమాచారం పంపాలని అందులో కోరారు. ఈ నెల 18వ తేదీలోపు అన్ని శాఖ లు ఈ సమాచారం పంపాలని లేఖలో స్పష్టం  చేశారు. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు, 2018-19 సవరించిన అంచనాలపై ఆన్‌లైన్‌లో ఈ నెల 14 కల్లా సమర్పించాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి వచ్చిన గ్రాంటుల ఆధారంగా పూర్తిస్థాయి పద్దులతో కూడిన బడ్జెట్‌ను సెప్టెంబర్‌లో అసెంబ్లీలో పెట్టాలని నిర్ణయించింది. మొత్తం రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉండగా ఇందులో రెవిన్యూ వ్యయం 1,31,629 కోట్లు, మూలధన వ్యయం రూ.32,815 కోట్లు, రెవిన్యూ మిగులు రూ.6564 కోట్లు, ఆర్థిక లోటు రూ. 27,749 కోట్లుగా చూపారు. అయితే ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ మాత్రం రూ. 2 లక్షల కోట్లకు చేరుతుందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఓటాన్ అకౌంట్‌లో స్పష్టత రాని అంశాలపై పూర్తిస్థాయి బడ్జెట్‌లో వివరించనున్నారు.

సంబంధిత వర్గం

సెప్టెంబర్1నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.