(Local) Tue, 02 Jun, 2020

సాగర్ కాలువలకు నీటి విడుదల

August 11, 2019,   6:01 PM IST
Share on:
సాగర్ కాలువలకు నీటి విడుదల

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీ శైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు వద్ద జలదృశ్యం కనువిందు చేస్తోంది. శ్రీ శైలం డ్యామ్‌కు భారీగా వరద నీరు చేరుతుండడం తో దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గేట్లు ఎ త్తివేయగా, శనివారం ఉదయం 6 గేట్లను ఎత్తివేశారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు పాలధారలా ఉ ప్పొంగుతూ నాగార్జునసాగర్ వైపు ఉరక లేస్తోంది. ఈ అద్భుతమైన రమణీయ దృశ్యాన్ని చూసేందు కు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. భారీగా వరద ప్రవాహం ఉండ టంతో అధికారులు మొత్తం 12 గేట్లకు గాను 10 గేట్లను ఎత్తి దాదాపు 2,43,171 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు వదులు తున్నారు. ఒక్కో గేటును 10 మీటర్ల మేర ఎత్తామని, మొత్తం 4.04లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.70 అడుగులుగా నమోదయ్యింది.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. నల్లగొండ జిల్లాలో 100, సూర్యాపేట జిల్లాల్లో 80 చెరువులు పూర్తి స్థాయిలో నిండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న మూసీ వరదతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. రెండు వందలకు పైగా చెరువులు అలుగెత్తుతున్నాయి.

సంబంధిత వర్గం
డైలమాలో సీఎం జగన్
డైలమాలో సీఎం జగన్
శ్రీశైలానికి కృష్ణమ్మా పరవళ్లు ...రేపు సాగర్ కు నీ ...
శ్రీశైలానికి కృష్ణమ్మా పరవళ్లు ...రేపు సాగర్ కు నీ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.