(Local) Fri, 22 Nov, 2019

మంత్రి వర్గ విస్తరణలో హరీష్ రావు కి చోటు దక్కేనా ..?

August 28, 2019,   2:30 PM IST
Share on:
మంత్రి వర్గ విస్తరణలో హరీష్ రావు కి చోటు దక్కేనా   ...

త్వరలోనే సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపడతారని ఊహాగానాలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విస్తరణలో కొందరు పాతవారిని తప్పిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. కేటీఆర్ మళ్లీ కేబినెట్‌లోకి రావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రులతో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కామెంట్ చేయడంతో… కేబినెట్‌లోకి కేటీఆర్ ఎంట్రీ దాదాపుగా లాంఛనమే అని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మాజీమంత్రి హరీశ్‌రావును కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అన్నదే టీఆర్ఎస్ శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మంత్రివర్గ విస్తరణ జరిగితే కేటీఆర్‌తో పాటు హరీశ్ రావుకు చోటు గ్యారంటీ అనే ప్రచారం కొద్దికాలంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సారి కూడా హరీశ్ రావుకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు లేవనే ప్రచారం మొదలైంది. హరీశ్ రావుకు బదులుగా మెదక్ జిల్లా నుంచి మరొకరికి కేసీఆర్ స్థానం కల్పించే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది. దీంతో టీఆర్ఎస్ సీనియర్ నాయకుల్లో ఒకరైన హరీశ్ రావుకు మళ్లీ మంత్రి పదవి దక్కుతుందా లేదా అని ఆయన అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత వర్గం
తెలంగాణా ఆర్టీసీ కార్మికులకు సీఎం హెచ్చరిక
తెలంగాణా ఆర్టీసీ కార్మికులకు సీఎం హెచ్చరిక

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.