(Local) Mon, 22 Jul, 2019

సోషల్ మీడియాలో పుకార్లను పుట్టిస్తే కఠిన చర్యలు!

July 02, 2019,   2:15 PM IST
Share on:

సాంకేతిక రంగం అభివృద్ది చెందిన నేపథ్యంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన నేడు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని తప్పుడు ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సోమవారం హెచ్చరించారు.  కొంతమంది పని గట్టుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ అనవసర పుకార్లను పుట్టిస్తున్నారు.ఇది కరెక్ట్ కాదని సీపీ సజ్జనార్ వివరించారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై పౌరులు సైబరాబాద్ వాట్సాప్ 9490617444కు సమాచారం ఇవ్వాలని తెలిపారు

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.