(Local) Fri, 23 Jul, 2021

వాహనం పాడైతే పోలీసులకు సమాచారంఇవ్వండి ....

November 29, 2019,   2:17 PM IST
Share on:
వాహనం పాడైతే పోలీసులకు సమాచారంఇవ్వండి ....

వాహనాలపై వెళ్లేటప్పుడు బైక్‌ పంచర్‌ లాంటి సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసుల సహాయం తీసుకోవాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ సూచించారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక పోలీసులు వెంటనే స్పందించి వాహనాన్ని మరమ్మతు చేయించడం లేదా గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చడంలో తోడ్డాటునందిస్తారన్నారు. ఈ మేరకు పోలీసు కంట్రోల్‌ Room No.100కు కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. 9490617111 వాట్సప్‌ నెంబర్‌కి లొకేషన్‌ కూడా షేర్‌ చేయ్యొచ్చని తెలిపారు. తాజాగా షాద్‌నగర్‌లో జరిగిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హత్య కేసుతో పాటు నగర శివారులో హత్యోదంతాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మహేశ్‌ భగవత్‌ ఈ సూచనలు చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.