(Local) Tue, 02 Jun, 2020

బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లలో సిఎం …. కేసిఆర్ తనదైన ముద్ర

August 11, 2019,   6:05 PM IST
Share on:
బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లలో సిఎం …. కేసిఆర్  తనదైన మ ...

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజిలు , పంపుహౌస్‌లకు దేవతామూర్తుల పేర్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ఖరారు చేశారు. మేడిగడ్డ బ్యారేజికి లక్ష్మి బ్యారేజిగా, కన్నెపల్లి పంపుహౌస్‌కు లక్ష్మి పంపుహౌస్‌గా నామకరణం చేశా రు. అన్నారం బ్యారేజికి సరస్వతి బ్యారేజిగా, సిరిపురం పంప్ హౌస్‌కు సరస్వతి పంపుహౌస్‌గా, సుందిళ్ల బ్యారేజికు పార్వతి బ్యారేజిగా, గోలివాడ పంపుహౌస్‌కు పార్వతి పంపుహౌజుగా, నంది మేడారం రిజర్వాయర్ కమ్ పంపు హౌస్‌కు నంది పేరు ఖరారు చేశారు. లక్ష్మిపురం పంపుహౌజుకు గాయత్రి పేరు పెట్టారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.