(Local) Sat, 14 Dec, 2019

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేశవరావు

June 13, 2019,   11:00 PM IST
Share on:
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేశవరావు

టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో గురువారం ప్రగతిభవన్ లో జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత, లోక్ సభా పక్ష నేత, రాజ్యసభ పక్ష నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సీనియర్ ఎంపి కె.కేశవరావును ఎన్నుకున్నారు.లోకసభ పక్ష నాయకుడిగా ఖమ్మం ఎం.పి. నామా నాగేశ్వర్ రావు ను,  ఉప నాయకుడిగా మెదక్ ఎం.పి. కొత్త ప్రభాకర్ రెడ్డిని, విప్ గా జహీరాబాద్ ఎం.పి. బిబి పాటిల్ ను ఎన్నుకున్నారు. రాజ్యసభలో టిఆర్ఎస్ పక్ష నాయకుడిగా ఎంపి కె.కేశవరావును, ఉప నాయకుడిగా బండ ప్రకాశ్ ను, విప్ గా జోగినిపల్లి సంతోష్ కుమార్ ను ఎన్నుకున్నారు.టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుల ఎంపికకు సంబంధించిన సమాచారంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.