(Local) Wed, 21 Aug, 2019

అత్తివరదరాజ స్వామి సన్నిధిలో కేసీఆర్

August 12, 2019,   3:39 PM IST
Share on:

తమిళనాడు కాంచీపురంలోని అత్తివరదరాజ స్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి కుటుంబ సభ్యులతో బయల్దేరిన కేసీఆర్... రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కంచికి వెళ్లారు. నగరిలో ఎమ్మెల్యే రోజా కేసీఆర్ కు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాంచీపురం చేరుకోగానే ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులు అత్తి వరదరాజ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ వెంట ఆయన కుమార్తె, మాజీ ఎంపీ  కవిత, ఎమ్మెల్యే రోజా ఉన్నారు. కాంచీపురం నుంచి తిరుమల వెళ్తనున్న కేసీఆర్.. శ్రీవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ కు బయల్దేరుతారు

సంబంధిత వర్గం

భద్రాద్రి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.