(Local) Sat, 30 May, 2020

మై హోమ్ చైర్మ‌న్ ఇంట్లో ఐటి సోదాలు

July 05, 2019,   11:46 AM IST
Share on:
మై హోమ్ చైర్మ‌న్ ఇంట్లో ఐటి సోదాలు

హైద‌రాబాద్ న‌గ‌రంలో ఐటి సోదాలు మ‌ళ్లీ క‌ల‌క‌లం రేపాయి. గురువారం రాత్రి నందినిహిల్స్‌లోని మై హోమ్ చైర్మ‌న్ రామేశ్వ‌ర‌రావు ఇంట్లో, కార్యాల‌యాల్లో ఐటి అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ సోదాల్లో దాదాపు 200 మందికి పైగా అధికారులు పాల్గొన్న‌ట్లు తెలిసింది. ప‌లు కీల‌క‌ ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం. బంధువుల ఇళ్ల‌లోనూ విస్తృతంగా సోదాలు చేస్తున్న‌ట్లు  తెలిసింది. కంపెనీ లావాదేవీల‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ సోదాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. గురువారం ఉదయం ఏడు గంటల నుంచే ఈ సోదాలు జరుగుతున్నప్పటికి అది సాయంత్రం వరకు బయటికి రాలేదు. బెంగుళూరుకి చెందిన 15 మంది ఐటీ అధికారులు కూడా ఈ సోదాల్లో పాల్గొన్నారు. హైటెక్ సిటిలోని మై హోం కార్యాలయంలో కూడా సోదాలు చేశారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు  ఓ ఐటీ అధికారి తెలిపారు. సోదాలింక కొనసాగుతాయన్నారు. మై హోం రామేశ్వరరావు తెలంగాణ సీఎం కేసీఆర్ కు సన్నిహితునిగా పేరుంది. ఇటీవల పలు మీడియా సంస్థల్లో పెట్టుబడులు పెడుతూ వాటిని రామేశ్వరరావు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఐటీ అధికారులు దాడి చేసినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కు ఝలకిచ్చేందుకే బీజేపీ ఈ దాడులు చేయిస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.