(Local) Mon, 17 Feb, 2020

ఆర్టీసీ కార్మికుల జీతాలపై హైకోర్టులో విచారణ

November 28, 2019,   9:55 AM IST
Share on:
ఆర్టీసీ కార్మికుల జీతాలపై హైకోర్టులో విచారణ

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జీతాలపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. వేతన చట్టం ప్రకారం వేతనం మినహాయించుకునే అధికారం ఆర్టీసీకి ఉందని అదనపు ఏజీ హైకోర్టు తెలిపారు. ఒక్కరోజు గైర్హాజరుకు 8రోజుల వేతనం మినహాయించే అధికారం ఉందని పేర్కొన్నారు. మరోవైపు పనిచేసిన సెప్టెంబరు నెల జీతాలు కూడా చెల్లించకపోవడం చట్ట విరుద్దమని కార్మిక సంఘాల తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, చేసిన పనికి జీతం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. వేతనాలపై కార్మిక న్యాయస్థానానికి వెళ్లాలని, హైకోర్టుకు కాదని ఏజీ సూచించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.