(Local) Wed, 24 Jul, 2019

అటవీశాఖ ఉద్యోగులకు ప్రభుత్వ భరోసా

July 03, 2019,   1:30 PM IST
Share on:

అటవీశాఖ అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భరోసా కల్పించారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఉద్యోగులు, సిబ్బంది ధైర్యంగా ఉండాలని, మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. అధికారులు, సిబ్బంది కి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని వివరించారు. అటవీశాఖ ఉద్యోగుల సంఘం జెఎసి ప్రతినిధుల సంఘం ప్రతినిధులు సచివాలయంలో మంత్రిని కలిశారు. అధికారులు, సిబ్బందిపై జరుగుతున్న దాడులు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రికి వినతిపత్రాన్ని సమర్పించారు.

అటవీ ఉద్యోగులపై దాడి చేసిన వారిని సత్వరమే శిక్షించడానికి ఫాస్టుట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని, నిందితులపై పిడి యాక్డును ప్రయోగించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న అటవీశాఖ ఉద్యోగులు, అందులోనూ ఓ మహిళ ఉద్యోగిపై దాడి చేయడం గర్హనీయమన్నారు. సర్సాల దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. దాడి కి పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అధికారులు ఆత్మస్థైరం కోల్పోకుండా ముందు కు సాగాలని సూచించారు. పోలీసుశాఖ సహాయంతో రక్షణ కల్పిస్తామని హామీనిచ్చారు. అడవులు ఉంటేనే మన మనుగడ సాధ్యమని, అడవుల పరిరక్షణపై విసృత్తంగా ప్రచారం చేయాలని సూచించారు. మంత్రిని కలిసిన వారిలో వివిధ సంఘాల ప్రతినిధులు డి.వెంకటేశ్వరరెడ్డి, బి.మోహన్, నాగేంద్రబాబు, మౌజం అలీఖాన్, ఆదినారాయణ ఉన్నారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.