(Local) Sat, 07 Dec, 2019

తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం

August 29, 2019,   11:11 AM IST
Share on:
తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నుంచి ఢిల్లీ  వెళుతున్న తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం ఉత్తరప్రదేశ్ లోని ఫరీదాబాద్ జిల్లా భాగల్ ఘాట్ వద్ద రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. బీ1 భోగీలో చెలరేగిన మంటలు ఎస్ 10 భోగీకి వ్యాపించాయి. దీంతో ఈ రెండు భోగీలు పూర్తిగా కాలిపోయాయి. ప్రయాణికులు ప్రమాదాన్ని పసిగట్టి రైలును నిలిపేసి కిందికి దిగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాలిపోయిన భోగీలను రైలు నుంచి వేరు చేశారు. ఏసీ బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారు.

సంబంధిత వర్గం
కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కేటీఆర్ సమావేశం
కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కేటీఆర్ సమావేశం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.