(Local) Sat, 06 Jun, 2020

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటుకు ఎఐసిసి నిర్ణయం

July 04, 2019,   12:35 PM IST
Share on:
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటుకు ఎఐసిసి నిర్ణ ...

కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆ పార్టీ అధిష్టానం చర్యలకు తీసుకోవడానికి సిద్ధమైంది. రాజగోపాల్ బిజెపిలో చేరకముందే వేటు వేయాలని ఎఐసిసి నిర్ణయం తీసుకుంది. భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను కూడా అధిష్టానానికి క్రమ శిక్షణ కమిటీకి పంపింది. రాజగోపాల్ రెడ్డిపై వీలైనంత త్వరగా వేటు వేస్తేనే పార్టీకి ప్రయోజనం ఉంటుందని క్రమ శిక్షణ కమిటీ ఆలోచన చేస్తుంది. రాజగోపాల్ రెడ్డి సతీమణి ఎంఎల్‌సి ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ పలు మార్లు నోటీసులు కూడా జారీ చేసింది. తెలంగాణలో టిఆర్‌ఎస్ పత్యామ్నాయంగా బిజెపి అని పలుమార్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.