(Local) Mon, 23 Sep, 2019

గురువారం పాలమూరులో సీఎం కేసీఆర్ పర్యటన

August 28, 2019,   1:15 PM IST
Views: 65
Share on:
గురువారం పాలమూరులో సీఎం కేసీఆర్ పర్యటన

తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను ఆయన పరిశీలించనున్నారు. కర్వెన, వెట్టెం,నార్లాపూర్, ఏదులలో జరుగుతున్న పనులను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసినంత వేగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించనున్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని సీఎం కేసీఆర్ గతంలో వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ గురువారం ఉదయం మహబూబ్ నగర్ చేరుకొని సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

సంబంధిత వర్గం
కోరుట్ల ఎమ్మెల్యే కంటతడి....
కోరుట్ల ఎమ్మెల్యే కంటతడి....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.