(Local) Wed, 21 Aug, 2019

టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో సిఎల్‌పి విలీనం సంపూర్ణం

June 07, 2019,   1:12 PM IST
Share on:

కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని(సిఎల్‌పి) తెలంగాణ రాష్ట్రసమితి శాసనసభపక్షం (టిఆర్‌ఎస్‌ఎల్‌పి)లో విలీనం చేసినట్లు అసెంబ్లీ సచివాలయం ప్రకటించింది. ఈ మేరకు గురువారం సిఎల్‌పి విలీనంపై శాససనభ కార్యదర్శి నర్సింహా చార్యులు బులెటిన్ జారీ చేశారు. సిఎల్‌పికి చెందిన 12 మంది ఎంఎల్‌ఎలను ఇక టిఆర్‌ఎస్‌ఎల్‌పి సభ్యులుగా పరిగణించనున్నట్లు అందులో పేర్కొన్నారు. అంతకముందు కాంగ్రెస్‌ను వీడిన 12 మంది ఎంఎల్‌ఎలు గురువారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి సిఎల్‌పిని అధికార టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో విలీనం చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారి సంతకాలతో కూడిన ఒక వినతి పత్రాన్ని స్పీకర్‌కు అందజేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మొత్తం 19 మంది శాసనసభ్యులు ఉండగా, ఇందులో సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియా నాయక్, వనమా వెంకటేశ్వరరావు, గండ్ర వెంకట రమణారెడ్డి, చిరుమర్తి లింగయ్య, సురేందర్, పైలట్ రోహిత్ రెడ్డిలు టిఆర్‌ఎస్ కండువా కపుకున్న విషయం తెలిసిందే. వీరంతా స్పీకర్‌ను కలిసి రాజ్యాంగ బద్దంగానే సిఎల్‌పిని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని కోరారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన స్పీకర్ ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశించారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కూడా విలీన ప్రక్రియకు అంగీకారం తెలపడంతో రాజ్యంగంలోని 10 షెడ్యూల్‌లోని అసెంబ్లీ వ్యవహారాల్లోని 4వ పేరాలో ఉన్న నిబంధనల మేరకు మూడో వంతు సిఎల్‌పి సభ్యులు టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో విలీనం చేయాలని కోరడంతో నర్సింహాచార్యులు బులిటెన్ విడుదల చేశారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.