(Local) Wed, 24 Jul, 2019

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల జాతర ప్రారంభం

July 04, 2019,   12:34 PM IST
Share on:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం బోనాల జాతర ప్రారంభమైంది. గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించారు. గురువారం టోలీచౌకీ నుంచి ఫలహార ర్యాలీ ప్రారంభమైంది. ఈ క్రమంలో పూజారి ఇంటి వద్ద అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఘటాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆపై ఘటాలను కొండపై ఉన్న అమ్మవారికి సమర్పించారు. తెలంగాణ వ్యాప్తంగా మాసం రోజుల పాటు ఈ బోనాల జాతర జరగనుంది.  తెలంగాణలో ఆషాఢం, శ్రావణ మాసాల్లో బోనాల జాతర జరుపుతారన్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ జంటనగరాల్లో మాత్రం ఆషాఢమాసంలోనే బోనాల పండుగ చేసుకుంటారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.