(Local) Sun, 20 Oct, 2019

అక్బరుద్దీన్ ఒవైసీకి కీలక పదవి ఇచ్చిన కేసీఆర్....

September 22, 2019,   8:09 PM IST
Share on:
అక్బరుద్దీన్ ఒవైసీకి కీలక పదవి ఇచ్చిన కేసీఆర్....

శాసనసభ పక్షం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ కేబినెట్ హోదా పొందనున్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజా పద్దులు (పీఏసీ) కమిటీ పదవి ఎంఐఎం పార్టీని వరించడంతో ఆయన కేబినెట్ హోదా పొందారు. ఎంఐఎం పార్టీకి ఈ పదవి వరించడం ఇదే తొలిసారి. పది రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలలో మూడు బిల్లులతో పాటు ఒక తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. అనంతరం తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఆ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వడం అనేది సంప్రదాయంగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. దీంతో పీఏసీ చైర‍్మన్‌ పదవి ఎంఐఎంను వరించింది. 

 

సంబంధిత వర్గం
ఆర్టీసి సమ్మె.. సర్కార్ కు అందిన హైకోర్టు కాపీ
ఆర్టీసి సమ్మె.. సర్కార్ కు అందిన హైకోర్టు కాపీ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.