(Local) Wed, 24 Jul, 2019

ప్రపంచ కప్ : పోరాడి ఓడిన భారత్...ఇంగ్లాండ్ సెమీస్ ఆశలు సజీవం

June 30, 2019,   11:34 PM IST
Share on:

వరల్డ్ కప్ లో ఇండియా మొట్టమొదటి సారి ఓటమిని చవిచూసింది  ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్ పై  31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. . తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 337   పరుగులు చేయగా  338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా జట్టు రోహాత్ శర్మ సెంచరీ చేసినప్పటికి  స్వల్పతేడాతో ఓటమి పాలయింది..దీంతో భారత్ కు వచ్చిన నష్టం ఏమిలేకపోయినప్పటికి మన చిరకాల ప్రత్యర్థి అయినా పాకిస్థాన్ కు సెమీస్ అవకాశాలు దాదాపుగా లేకుండా పోయింది..ఈ మ్యాచ్ ద్వారా ఆతిధ్య జట్టు ఇంగ్లాడ్ కు సెమీస్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి .

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే ఓపెనర్లు జాసన్ రాయ్ (66), బెయిర్ స్టో(111) రాణించగా తొలివికెట్ భాగస్వామ్యానికి ఇంగ్లాండ్ కేవలం 22 ఓవర్లకే 160 సాధించింది. జాసన్ రాయ్ ఔట్ అయినప్పటికీ ఇంగ్లాండ్ బెయిర్ స్టో రాణించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టు కేవలం 30 ఓవర్లకే 200 స్కోరు దాటింది. అనంతరం జానీ బెయిర్ స్టో 31 ఓవర్లో వెనుదిరిగ్గా, ఆ తర్వాత వెంటనే వచ్చినా ఇయాన్ మోర్గాన్ కేవలం ఒక పరుగుకే పెవిలియన్ ఔటయ్యాడు. అనంతరం వచ్చిన బెన్ స్టోక్స్ (79) రాణించడంతో ఇంగ్లాండ్ స్కోరు 300 దాటింది. భారత్ బౌలర్లలో షమి 5 వికెట్లు పడగొట్టగా, బుమ్రా, కుల్ దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం ,బ్యాటింగ్ కి దిగిన భారత్ టార్గెట్ ఛేదనలో భాగంగా 2 ఓవర్లోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు. దీంతో భారమంతా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే పడింది. ఇద్దరూ నెమ్మదిగా ఆడుతూ వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డారు. స్కోరు 50 పరుగులు దాటేందుకు 14 ఓవర్లు పట్టింది. అనంతరం విరాట్ కోహ్లీ ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే రోహిత్ శర్మ సైతం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 22 ఓవర్లకు స్కోరు 100 దాటింది. అయితే 28వ ఓవర్లో కోహ్లీ(66) ఔట్ కావడంతో భారీ లక్ష్య ఛేదనలో ఒత్తిడి పెరిగింది. అనంతరం రోహిత్ శర్మ(102) సెంచరీ పూర్తి చేసుకొని వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చి రిషబ్ పంత్ (32), హార్దిక్ పాండ్యా (45) ధాటిగా పరుగులు సాధించే క్రమంలో ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చి ధోనీ సైతం వేగంగా పరుగులు సాధించడంలో విఫలమయ్యాడు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.