(Local) Sat, 11 Jul, 2020

వరల్డ్ కప్ : ఇంగ్లండ్ X బంగ్లాదేశ్

June 08, 2019,   2:29 PM IST
Share on:
వరల్డ్ కప్ : ఇంగ్లండ్  X  బంగ్లాదేశ్

ప్రపంచకప్‌లో భాగంగా శనివారం జరిగే కీలక మ్యాచ్‌కు ఆతిథ్య ఇంగ్లండ్, ఆసియా ఆశాకిరణం బంగ్లాదేశ్ జట్లు సిద్ధమయ్యాయి. ఇరు జట్లు ఇప్పటి వరకు రెండేసి మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో ఒకదాంట్లో గెలిచి మరో దాంట్లో ఓటమి పాలయ్యాయి. దీంతో శనివారం జరిగే మూడో మ్యాచ్‌లో రెండు జట్లు కూడా గెలుపే లక్షంగా పెట్టుకున్నాయి. పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలుకావడంతో ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసం కాస్త సన్నగిల్లింది. మరోవైపు బంగ్లాదేశ్ కిందటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పోరాడి ఓడింది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికాపై సంచలన విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా మెరుగైన ఆటను కనబరచాలని తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ బలంగా కనిపిస్తోంది. అయితే ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కూడిన బంగ్లాదేశ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ సాకిబ్ అల్ హసన్ జట్టుకు అందుబాటులో ఉన్నాడు. దీంతో బంగ్లాదేశ్ సంచలన ఫలితంపై కన్నేసింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.