(Local) Fri, 23 Jul, 2021

మళ్ళీ మొదలైన 'దాదా'గిరి

November 02, 2019,   9:52 PM IST
Share on:
మళ్ళీ  మొదలైన 'దాదా'గిరి

ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేస్తున్నా...పాకిస్దాన్ ఆటగాళ్లు  రెచ్చగొడుతున్నా..ఇంగ్లాండ్ ఆటగాళ్లు చిల్లర వేషాలేస్తున్నా..సౌతాఫ్రికా ఆటగాళ్లు గిల్లికజ్జాలు పెడుతున్నా..వెస్టిండీస్ ఆటగాళ్లు అల్లరి పెడుతున్నా..ప్రతి టీమ్ భారత ఆటగాళ్లని రెచ్చగొడుతుంటే.. మనకెందుకులే అని ఉండే వేళలో మాటకు, మాట ..దెబ్బకు దెబ్బకు అనే కెప్టెన్ పుట్టుకొచ్చాడు...
పీకల్లోతు ఫిక్సింగ్ కుంభకోణంలో కూరుకుపోయి ..వన్డేల్లో 7 వ స్ధానం, టెస్టుల్లో 6 వ స్దానంలో ఉన్న భారత క్రికెట్ కి ఊపిరిపోసాడు..టెస్టు మ్యాచ్ ను ఎందుకు చూడాలి అనుకొనే రోజుల్లో సెహ్వాగ్ ను తీసుకొచ్చాడు. భారత జట్టులో అవుట్ స్వింగర్ లేడు అన్న లోటును జహీర్ ఖాన్ , ఇర్ఫాన్ పఠాన్ రూపంలో  తీర్చాడు. ఫీల్డింగ్ కీలకం అని భావించి యువరాజ్ , కైఫ్ అనే చిరుతల్ని తీసుకొచ్చాడు. 145  స్పీడ్ తో బౌలింగ్ వేసే  ఆశిష్ నెహ్రాని తీసుకొచ్చి పేస్ బౌలింగ్ కు అసలుసిసలు నిర్వచనం ఇచ్చాడు. కుంబ్లే కు తోడుగా హర్భజన్ ను తీసుకొచ్చి స్పిన్ విభాగాన్ని మరింత పటిష్టం చేసాడు. మ్యాచ్ ను ముగించి జట్టును గెలిపించే భాద్యత 'స్టన్నింగ్ కీపర్  ధోని'కు ఇచ్చాడు ...దాదా తెచ్చినవారంతా...ఏదో ఒకటి రెండేళ్లు ఆడి కనుమరుగైనవారు కాదు...భారత క్రికెట్ ను ఉన్నతమైన స్ధానంలో నిలబెట్టినవారే.. ఒకటి అరా మ్యాచ్ లు కాదు ఏకంగా ఒక దశాబ్దంగా  భారత్ ను ప్రపంచ క్రికెట్ లో కాలర్ ఎగరేసేలా నిలబెట్టినవారే..దాదా...భారత క్రికెట్ రూపురేఖలు మార్చిన అద్బుత ఆటగాడు..అత్యద్బుత కెప్టెన్.  తిరుగులేని స్థితిలో ఉన్నపుడు ఫామ్ కోల్పోయిన గంగూలీ జట్టులో స్తానం కోల్పోయాడు. 2008 లో రిటైర్మెంట్ ప్రకటించిన దాదా, తరువాత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా భాద్యతలు నిర్వర్తించాడు. ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన గంగూలీ పాలనలో కూడా తనదైన మార్క్ వేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. తను జట్టులో కెప్టెన్ గా ఉన్నప్పుడు చేసిన సాహసాలు, సృష్టించిన రికార్డులు ఇంకా కళ్ళముందు మెదులుతూనే ఉన్నాయి, ఇలాంటి సమయంలో మరోసారి భారత్ ను తిరుగులేని స్థాయిలో నిలబెట్టడానికి గంగూలీ సిద్దమయ్యాడు.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.