(Local) Mon, 16 Sep, 2019

మరో అరుదైన రికార్డుకి చేరువలో కోహ్లీ ...

August 21, 2019,   4:11 PM IST
Views: 104
Share on:
మరో అరుదైన రికార్డుకి చేరువలో కోహ్లీ ...

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుని చేరువయ్యాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా నార్త్‌ సౌండ్‌లో సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో విండిస్‌తో గురువారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది.ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఒక్క సెంచరీని సాధిస్తే ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్ రికీ పాంటింగ్‌(19) సమం చేస్తాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 18 సెంచరీలతో పాంటింగ్‌ తరువాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో సఫారీ మాజీ కెప్టెన్ గ్రేమ్‌ స్మిత్‌(25) తొలి స్థానంలో ఉన్నాడు.ఇక, కోహ్లీ విషయానికి వస్తే టెస్టుల్లో మొత్తం 25 సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో కెప్టెన్‌గా 18 సెంచరీ సాధించాడు.

ఇక విండిస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా ధోని రికార్డును విరాట్ కోహ్లి బద్దలు కొడతాడు. కోహ్లీ 46 టెస్టులకు కెప్టెన్సీ వహించగా 26 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది.ధోని కెప్టెన్సీలో 60 టెస్టుల్లో 27 విజయాలు నమోదు చేసింది. ఇప్పటికే ముగిసిన మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో కైవసం చేసుకున్న కోహ్లీసేన.... అనంతరం జరిగిన వన్డే సిరిస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా... మిగిలిన రెండు వన్డేల్లో కోహ్లీసేన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మూడు వన్డేల సిరిస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 234 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతేకాదు ఒక దశాబ్దంలో 20,000 పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. దీంతో పాటు విండిస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

సంబంధిత వర్గం
అవకాశం వచ్చిన సమయంలో సద్వినియోగం చేసుకోండి - యువ ఆ ...
అవకాశం వచ్చిన సమయంలో సద్వినియోగం చేసుకోండి - యువ ఆ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.