(Local) Fri, 29 May, 2020

ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న కెప్టెన్ కోహ్లీ

November 23, 2019,   12:03 PM IST
Share on:
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...

బంగ్లాదేశ్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరుపున ఐదువేల పరుగు మైలురాయిని అత్యంత అందుకున్న తొలి కెప్టెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.బంగ్లాదేశ్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఈ మైలురాయిని అందుకుని కొత్త చరిత్ర సృష్టించాడు. పింక్ బాల్ టెస్టులో కోహ్లీ 32 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. 

భారత్ తరుపున ఇప్పటివరకు 52 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కోహ్లీ 4,968 పరుగులు చేశాడు. తాజాగా, పింక్ బాల్ టెస్టులో కోహ్లీ 32 పరుగులు చేయడంతో టెస్టుల్లో ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్న కెప్టెన్ల జాబితాలో చేరాడు. అంతకుముందు ఈ రికార్డు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ పేరిట ఉండేది.దీంతో పాటు కెప్టెన్‌గా ఐదువేల టెస్టు పరుగులు చేసిన ఆరో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్‌(97 ఇన్నింగ్స్‌లు), క్లైవ్‌ లాయిడ్‌(106 ఇన్నింగ్స్‌లు), గ్రేమ్‌ స్మిత్‌(110 ఇన్నింగ్స్‌లు), అలెన్‌ బోర్డర్‌(116 ఇన్నింగ్స్‌లు), స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌(130 ఇన్నింగ్స్‌లు)లు ఉన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.