(Local) Wed, 24 Jul, 2019

వరల్డ్‌ కప్‌ టోర్నీ కి విజయ్‌ శంకర్‌ దూరం

July 01, 2019,   3:56 PM IST
Share on:

ఐసిసి క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ టోర్నీ కి విజయ్‌ శంకర్‌ దూరమయ్యారు. బటనవేలికి గాయం కారణంగా బాధపడుతోన్న విజరు శంకర్‌ ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నారు. ఇక విజరు శంకర్‌ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను భారత జట్టులో తీసుకునే అవకాశం ఉందంటూ.. బిసిసిఐ బోర్డు వర్గాలు తెలిపాయి. ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో బుమ్రా వేసిన బంతి మరోసారి విజరు శంకర్‌ బటన వేలికి తగిలిందని, అతను ఆడేందుకు పూర్తి ఫిట్‌గా లేకపోవడం వల్లే తిరిగి వెళ్లిపోతున్నాడని మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. ఇప్పటికే టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కూడా గాయం కారణంగా వరల్డ్‌ కప్‌ టోర్నీకి దూరమయ్యారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.