(Local) Fri, 25 Sep, 2020

‘పాత అలవాట్లు అంత సులభంగా పోవు’ -రవిశాస్త్రి పై నెటిజన్లు

November 15, 2019,   1:05 PM IST
Share on:
‘పాత అలవాట్లు అంత సులభంగా పోవు’ -రవిశాస్త్రి పై నె ...

టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి పై  నెటిజన్లు ఈ మధ్య విపరీతంగా ట్రోల్‌  చేస్తున్న విషయం తెలిసిందే .వెస్టిండీస్‌ పర్యటన నుంచి ఈ ట్రోలింగ్‌ పరంపర కొనసాగుతోంది. ప్రస్తుతం ఇండోర్‌ వేదికగా భారత్‌, బంగ్లాదేశ్‌ తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు శాస్త్రి ట్విటర్లో ఓ పోస్ట్‌ చేశాడు. బంతిని పట్టుకొని స్పిన్‌ బౌలింగ్‌ చేస్తున్న పోజు ఇచ్చాడు. ఈ చిత్రాలతో ‘పాత అలవాట్లు అంత సులభంగా పోవు’ అనే అర్థం వచ్చేలా ఓ వ్యాఖ్య జతచేశాడు. అంతే.. వెంటనే ట్విటర్లో వ్యంగ్య బాణాల మోత మొదలైంది. నెటిజన్లు అతడి చిత్రాలను మార్ఫింగ్‌ చేసి రీట్వీట్లు చేస్తున్నారు. ‘ప్రధాన కోచ్‌కు యోయో టెస్టు పెట్టాలి’ అని అంటున్నారు. మరికొందరు ‘నిజమే.. పాత అలవాట్లు పోవు’ అంటూ గ్లాసులోకి బీరు వంపుతున్న చిత్రాలు పెట్టేస్తున్నారు. రవిశాస్త్రిని లక్ష్యంగా ఎంచుకోవడం కొత్తేమీ కాదు. చాన్నాళ్లుగా నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.