(Local) Wed, 21 Aug, 2019

టీమిండియా హెడ్ కోచ్ ఇంటర్వ్యూ కోసం ఆరుగురి ఎంపిక

August 13, 2019,   5:09 PM IST
Share on:

టీమిండియా హెడ్ కోచ్ కోసం వచ్చిన దరఖాస్తులు నుండి  ఆరుగుర్ని ఇంటర్వూకి ఎంపిక చేసింది బీసీసీఐ . అయితే ప్రస్తుతం కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి దరఖాస్తు చేసుకోకుండానే అతడు ఇంటర్వూకి హాజరయ్యే అవకాశం ఉంది. రవిశాస్త్రితో పాటు న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హసన్, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఫిల్ సిమన్స్, ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ టామ్ మూడీ, భారత జట్టు మాజీ మేనేజర్ లాల్‌చంద్ రాజ్‌పుత్, టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ రాబిన్ సింగ్‌ ఉన్నారు. హెడ్ కోచ్‌ని ఎంపిక చేసే బాధ్యతను క్రికెటర్ కపిల్ దేవ్ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల క్రికెట్ సలహా కమిటీకి నిర్వహిస్తుంది. ఆగష్టు 16న ముంబయిలో వీరందరికీ ఇంటర్వూ నిర్వహించనున్నారు.

సంబంధిత వర్గం

నెంబర్4 లో శ్రేయస్ అయ్యర్ ను ఆడిస్తాం- రవిశాస్త్రి
టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రికే అవకాశాలు ఎక ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.