(Local) Sat, 27 Feb, 2021

సురేశ్ రైనా మోకాలికి సర్జరీ.. క్రికెట్‌కు దూరం

August 10, 2019,   2:33 PM IST
Share on:
సురేశ్ రైనా మోకాలికి సర్జరీ.. క్రికెట్‌కు దూరం

టీమిండియా సీనియర్ బ్యాట్స్ మెన్ సురేశ్ రైనా మోకాలికి ఆపరేషన్ జరిగింది. 32ఏండ్ల రైనా గత సీజన్ నుంచి మోకాలి నొప్పితో ఇబ్బందిపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే శాశ్వత పరిష్కారం కోసం వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. శస్త్రచికిత్స విజయవంతమైందని కోలుకునేందుకు ఆరు వారాల సమయం పడుతుందని రైనాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ వెల్లడించాడు.  రైనా ఆపరేషన్ పై బీసీసీఐ స్పందించింది. త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ట్వీట్ చేసింది. అంతర్జాతీయ కెరీర్‌లో రైనా భారత్ తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో 2018 జులైలో జరిగిన వన్డే మ్యాచ్‌లో చివరిసారిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.