(Local) Fri, 29 May, 2020

వచ్చే ఏడాది భారత పర్యటనకు శ్రీలంక జట్టు

September 27, 2019,   11:52 AM IST
Share on:
వచ్చే ఏడాది భారత పర్యటనకు శ్రీలంక జట్టు

2020 జనవరిలో శ్రీలంకతో టీం ఇండియా టీ-20 సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్ లో శ్రీలంకతో భారత్.. మూడు టీ-20లు ఆడనుంది. గువాహటి వేదికగా జనవరి 5వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. రెండో మ్యాచ్ ఏడవ తేదీన ఇండోర్‌ లో, మూడో మ్యాచ్ పూణే వేదికగా జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. జింబాబ్వే జట్టును ఐసీసీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో భారత పర్యటనకు రావాల్సిందిగా.. శ్రీలంక క్రికెట్ జట్టును బీసీసీఐ కోరింది. ప్రపంచకప్ తర్వాత బీసీసీఐ ప్రకటించిన టీం ఇండియా షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జనవరిలో జింబాబ్వే క్రికెట్ జట్టు భారత్ పర్యటనకు రావాల్సింది. అయితే జింబాబ్వేపై నిషేధం పడటంతో.. శ్రీలంకను బీసీసీఐ ఆహ్వానించింది. అందుకు శ్రీలంక బోర్డు అంగీకరించింది. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టు పాకిస్థాన్ పర్యటనలో ఉంది.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.