(Local) Sat, 24 Jul, 2021

అనిల్ కుంబ్లే కి క్షమాపణలు చెప్పిన వీరు

October 17, 2019,   4:26 PM IST
Share on:
అనిల్ కుంబ్లే కి క్షమాపణలు చెప్పిన వీరు

భారత మాజీ కోచ్, కెప్టెన్ అనిల్ కుంబ్లే గురువారం 49వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కుంబ్లేకి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టైల్ లో శుభాకాంక్షలు చెప్పారు. ఆయనకు శుభాకాంక్షలు చెప్తూనే.. గతంలో ఆయన సెంచరీ మిస్ అవ్వడానికి తానే కారణమైనందుకు ‘క్షమాపణ’ చెప్పాడు. భారత దిగ్గజ మ్యాచ్ విన్నర్లలో మీరు ఒకరు. మీలాంటి క్రికెటర్ అందరికి స్ఫూర్తిదాయకం. మీ కెరీర్‌లో రెండో సెంచరీ నావల్లే చేజారినందుకు సారీ చెప్తున్నాను. అయితే నిజ జీవితంలో మీరు సెంచరీ చేయాలని కోరుకుంటున్నాను. మరో 51ఏండ్లు… కమాన్ అనిల్ భాయ్.. హ్యాపీ బర్త్ డే’ అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.