(Local) Mon, 26 Aug, 2019

గంభీర్ రికార్డ్ ని బ్రేక్ చేసిన శుబ్ మాన్

August 09, 2019,   9:40 PM IST
Share on:

టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ పేరిట ఉన్న రికార్డును యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్ బ్రేక్ చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అతిచిన్న వయస్సులో ద్విశతకం సాధించిన భారత క్రికెటర్‌గా శుబ్‌మన్‌ ఘనత సాధించాడు. వెస్టిండీస్‌-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్టు మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గురువారం ఈ రికార్డు నెలకొల్పాడు. 2002లో జింబాబ్వేతో జరిగిన బోర్డు ప్రెసిడెంట్‌ ఎలెవన్‌ టెస్టులో గంభీర్‌ డబుల్ సెంచరీ సాధించాడు. అప్పుడు గంభీర్ వయస్సు 20 ఏళ్ల 124 రోజులు. ఇప్పుడు శుబ్‌మన్‌ 19 ఏళ్ల 334 రోజుల వయస్సులో టెస్టుల్లో ద్విశతకం(204) సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

సంబంధిత వర్గం

దీపక్ చాహర్ అరుదైన రికార్డు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.