(Local) Wed, 24 Jul, 2019

ప్రపంచ కప్ : నేడు కివీస్‌ X ఇంగ్లండ్

July 03, 2019,   2:05 PM IST
Share on:

ఐసిసి ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం టోర్నమెంట్‌  ఫేవరేట్లలో ఒకటైన ఇంగ్లండ్ మరో బలమైన ప్రత్యర్థి న్యూజిలాండ్‌ను ఢీకొంటోంది. ఈ మ్యాచ్ ఫలితంపై ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో పాటుగా మరో రెండు జట్ల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉండడంతో ఇది రెండు జట్లకు అత్యంత కీలకంగా మారింది. అయితే భారత్‌పై ఘన విజయం తర్వాత పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉన్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి సెమీ ఫైనల్లో స్థానాన్ని ఖరారు చేసుకోవాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఒక వేళ ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే, బంగ్లాదేశ్ పాకిస్తాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లో పాక్ భారీ తేడాతో విజయం సాధిస్తే ఆ జట్టు ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. మరో వైపు న్యూజిలాండ్ గనుక ఓడిపోతే బంగ్లాదేశ్, పాక్ మధ్య మ్యాచ్‌లో గెలుపొందే జట్టు పాయింట్లలో న్యూజిలాండ్‌తో సమానంగా నిలిచి సెమీఫైనల్‌లో అవకాశాలను సజీవంగా నిలుపుకొని ఉంటుంది.

ఇంగ్లాండ్ : టోర్నమెంట్ ప్రాంభంలోనే శ్రీలంక, ఆస్ట్రేలియాల చేతిలో వరస ఓటముల తర్వాత అన్ని వైపులనుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న ఇంగ్లండ్ రెండు రోజుల క్రితం భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా తన సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది. ఈ ఇద్దరితో పాటుగా కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఈ టోర్నమెంట్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో బుధవారం మ్యాచ్‌లో మరోసారి ఆ జట్టు భారీ స్కోరు సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఆ జట్టు బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉన్నట్లు కనిపిస్తోంది.బర్మింగ్‌హామ్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోప్లంకెట్ మూడు కీలక వికెట్లతో భారత్ బ్యాటింగ్ వెన్ను విరచగా క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్‌లు కూడా కీలక సమయంలో పొదుపుగా బౌల్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేశారు.

న్యూజిలాండ్ : పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్‌కన్నా ఒక పాయింట్ ఎక్కువతో మూడో స్థానంలో ఉన్న కివీస్ మొదట్లో వరస విజయాలతో దూసుకు పోయినా ఆ తర్వాత పాకిస్థాన్, ఆస్ట్రేలియాల చేతిలో ఓటమి పాలయి తన సెమీఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ రెండు మ్యాచ్‌లలో కూడా ఆ జట్టు బ్యాటింగ్ వెలవెలపోయింది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఆ జట్టులో ప్రతి ఒక్కరూ రాణించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కెప్టెన్ విలియమ్సన్‌తో పాటుగా మార్టిన్ గుఫ్తిల్ కూడా భారీ స్కోరు చేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ఇక ఇంగ్లండ్‌తో పోలిస్తే ఆ జట్టు బౌలింగ్ మెరుగ్గానే ఉందని చెపాలి.

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించిన ట్రెంట్ బౌల్ట్‌తో పాటుగా ఎక్స్‌ప్రెస్ బౌలర్‌గా పేరున్న ఫెర్గూసన్‌లు చెలరేగితే ఆ జట్టు విజయం నల్లేరుపై నడకే అవుతుంది.

ఏది ఏమయినా ఇరు జట్లకు అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో విజయం కోసం రెండు జట్లూ సర్వస్వం ఒడ్డుతాయనడంలో సందేహం లేదు. కాగా దుర్హమ్‌లోని చెస్టర్‌లి స్ట్రీట్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌కి కివీస్ అభిమానులతో పాటుగా పాక్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముంది. ఎందుకంటే కివీస్ గెలిస్తే పాక్ సెమీఫైనల్‌కు చేరేందుకు మార్గం సుగమం అవుతుంది. కనుక కివీస్ మద్దతుగా వారు నిలిచే అవకాశముంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.