(Local) Mon, 12 Apr, 2021

భారత్ – సౌతాఫ్రికా : రెండో టీ20 మ్యాచ్‌కు కొత్త చిక్కు

September 17, 2019,   2:58 PM IST
Share on:
భారత్ – సౌతాఫ్రికా : రెండో టీ20 మ్యాచ్‌కు కొత్త చి ...

భారత్ – సౌతాఫ్రికా మధ్య జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌కు కొత్త చిక్కు వచ్చిపడింది. బీసీసీఐ నుంచి ఇరు జట్ల భద్రత బాధ్యత పోలీసులు చూసుకుంటారు. అయితే దీని కోసం బీసీసీఐ చెల్లించాల్సిన రూ. 9 కోట్లు పేమెంట్ రాకపోవడంతో.. టీమిండియాకి భద్రతనిచ్చేందుకు చండీగఢ్ పోలీసులు నిరాకరించారు.ఎయిర్ పోర్ట్ నుంచి అరకొర భద్రత మధ్య వారు బీసీసీఐ ఏర్పాటు చేసిన హోటల్‌కు చేరుకోవాల్సి వచ్చింది. ఎలాగోలా హోటల్‌ వరకు తీసుకువచ్చినప్పటికీ అక్కడ మాత్రం పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. చేసేదేమిలేక బీసీసీఐ హోటల్‌ వద్ద ప్రైవేట్ సెక్యూరిటినీ ఏర్పాటు చేసింది. కాగా బుధవారం రాత్రి 7 గంటలకి రెండో టీ20 మ్యాచ్ జరగనుండగా.. తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా  రద్దు అయిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.