(Local) Sat, 30 May, 2020

అభిమాని హ్యాట్‌పై సంతకం

July 03, 2019,   1:07 PM IST
Share on:
అభిమాని హ్యాట్‌పై సంతకం

ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం టీమిండియా బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్‌ శర్మ ఓ అభిమానిని సర్‌ప్రైజ్‌ చేశాడు.ఈ క్రమంలో రోహిత్‌ కొట్టిన ఓ సిక్సర్‌ బంతి ఓ మహిళా అభిమానికి తగిలింది. 104 పరుగులు చేసి పెవిలియన్‌ చేరిన రోహిత్‌.. మైదానం నుంచి వెళ్లేటప్పుడు ఆగి అక్కడున్న అభిమానులను అడిగాడు. తన బంతి ఎవరికి తగిలిందో చెప్పాల్సిందిగా వారిని కోరాడు. మ్యాచ్‌ పూర్తయిన అనంతరం ఆమెను పిలిపించి, మాట్లాడి ఆమె హ్యాట్‌పై సంతకం చేసి ఇచ్చాడు. ఆమెతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. ఈ ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది. దీంతో ఇవి వైరల్‌ అవుతున్నాయి.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.