(Local) Wed, 11 Dec, 2019

నెంబర్4 లో శ్రేయస్ అయ్యర్ ను ఆడిస్తాం- రవిశాస్త్రి

August 19, 2019,   12:34 PM IST
Share on:
నెంబర్4 లో శ్రేయస్ అయ్యర్ ను ఆడిస్తాం- రవిశాస్త్రి

వన్డే జట్టులో నాలుగో స్థానం కోసం కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చకు టీమిండియా కోచ్ రవిశాస్త్రి పుల్ స్టాప్ పెట్టాడు. ఇక నుంచి వన్డేల్లో శ్రేయాస్ ను నాలుగో స్థానంలో పంపుతామని తెలిపాడు. ఇంతకు ముందు నాలుగో స్థానంలో అంబటి రాయుడును కొనసాగించారు. అతనికి వరల్డ్ కప్ లో ఛాన్స్ ఇవ్వకపోవడంతో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో నాలుగో స్థానం కోసం మళ్లీ ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ తో ఆడుతున్న వన్డే సిరీస్ లో యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ను బరిలోకి దించింది. నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయాస్.. కెప్టెన్ కోహ్లితో కలిసి మంచిగా పరుగులు రాబడుతూ నమ్మకం పెంచాడు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.