(Local) Wed, 21 Aug, 2019

టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రికే అవకాశాలు ఎక్కువ ...

August 07, 2019,   1:10 PM IST
Share on:

టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రినే ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి .బిసిసిఐకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. కపిల్‌దేవ్ నేతృత్వంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ కూడా రవిశాస్త్రినే కోచ్‌గా ఎంపిక చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు కూడా వెల్లడయ్యాయి. ప్రస్తుతం రవిశాస్త్రి వారిలో  ఆస్ట్రేలియా స్టార్ టామ్ మూడి ఒక్కడే ఉన్నాడు . అతను తప్పిస్తే మిగతా వారికి ఛాన్స్ దొరకడం అంత సులువు కాదనే చెప్పాలి.

మరోవైపు బిసిసిఐ, భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా రవిశాస్త్రికే మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోహ్లి మాటను కాదని బిసిసిఐ వ్యవహరిచడం దాదాపు అసాధ్యంగానే చెప్పాలి. ఇటీవల కాలంలో కోహ్లి బలమైన శక్తిగా మారాడు. జట్టు ఎంపికలో అతని పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. విండీస్ పర్యటనకు బయలుదేరే ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోహ్లి బహిరంగంగానే రవిశాస్త్రి పేరును ప్రతిపాదించాడు. బోర్డు కూడా రవిశాస్త్రివైపే మొగ్గు చూపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రవిశాస్త్రి ఎంపిక లాంఛనమేనని చెప్పక తప్పదు.

సంబంధిత వర్గం

శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం ఎత్తివేత

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.