(Local) Wed, 26 Feb, 2020

రాహుల్ ద్రవిడ్‌కు పెద్ద ఊరట...

August 14, 2019,   12:14 PM IST
Share on:
రాహుల్ ద్రవిడ్‌కు పెద్ద ఊరట...

ద్రవిడ్‌పై నమోదైన పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసులో క్రికెట్ పాలకుల కమిటీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ద్రవిడ్‌కు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో కీలక బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగమం చేసింది. బంతి ఇప్పుడు బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ కోర్టులో ఉందని సీఓఏ సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ రవి తొగ్డె అన్నారు. ‘ద్రవిడ్ కేసులో విరుద్ధ ప్రయోజనాల అంశమేమీ లేదు. అతడికి నోటీసులు అందాయి. మేం ఆయన నియామకాన్ని క్లియర్ చేశాం. మాకు వివాదమేమీ కనిపించలేదు. అంబుడ్స్‌మన్ ఏమైనా గుర్తిస్తే మాకు ఎందుకు కనిపించలేదో అప్పుడు వివరిస్తాం.ఆ తర్వాత జైన్ దానిని పరిగణనలోకి తీసుకుంటారు. ఇదంతా ఓ ప్రక్రియ. ఇదిలా కొనసాగుతుంది’ అని రవి తొగ్డె వెల్లడించారు. 

సంబంధిత వర్గం
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.