(Local) Fri, 15 Nov, 2019

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్న పి.వి.సింధు

August 24, 2019,   11:54 AM IST
Share on:
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌కు  ...

భారత స్టార్ షట్లర్, పి.వి.సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. నువ్వానేనా అన్నట్టు సాగిన సమరంలో సింధు చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. మూడు సెట్ల ఉత్కంఠ సమరంలో సింధు 12-21, 23-21, 21-19 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఆరంభ సెట్‌లో భారత స్టార్ సింధుకు చుక్కెదురైంది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన తైజు ఏ దశలోనూ సింధుకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తన మార్క్ షాట్లతో అలరించిన తైపీ క్రీడాకారిణి ఏ మాత్రం కష్టపడకుండానే సెట్‌ను దక్కించుకుంది. ఇక, రెండో సెట్‌లో సింధు పుంజుకుంది. ఈసారి దూకుడును ప్రదర్శిస్తూ ముందుకు సాగింది.

చూడచక్కని షాట్లతో తైజును ఉక్కిరిబిక్కిరి చేసింది. సింధు జోరుకు ప్రత్యర్థి ఒత్తిడికి గురైంది. అయినా ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరు యుద్ధాన్ని తలపించింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన సింధు సెట్‌ను సాధించింది. ఇక, ఫలితాన్ని తేల్చే మూడో గేమ్‌లో కూడా పోరు ఆసక్తి కరంగా సాగింది. ఇద్దరు కూడా అద్భుత పోరాట పటిమతో ఆకట్టుకున్నారు. దీంతో ఈసారి కూడా సమరం నువ్వానేనా అన్నట్టు కొనసాగింది, అయితే చివరి వరకు నిలకడైన ప్రదర్శన ఇచ్చిన సింధు సెట్‌ను గెలిచి సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈ విజయంతో సింధుకు కాంస్య పతకం ఖాయమైంది. ఇంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో సింధు 21-14, 21-6తో తొమ్మిదో సీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా)పై అలవోక విజ యాన్ని సాధించిన విషయం తెలిసిందే.

సంబంధిత వర్గం
మరో ముగ్గురు ప్రముఖులకు ఛాలెంజ్‌ విసిరిన పివి సింధ ...
మరో ముగ్గురు ప్రముఖులకు ఛాలెంజ్‌ విసిరిన పివి సింధ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.