(Local) Mon, 28 Sep, 2020

ఎంఎస్ ధోనీ కొత్త లుక్‌ - ఫోటోలు వైరల్

August 26, 2019,   10:15 AM IST
Share on:
ఎంఎస్ ధోనీ కొత్త లుక్‌ - ఫోటోలు వైరల్

ఇటీవల సైనిక విధులు పూర్తి చేసుకున్న ధోనీ తాజాగా  కొత్త లుక్‌తో జైపూర్ విమానాశ్రయంలో అభిమానులకు దర్శనమిచ్చాడు. ఓ వేడుకకు హాజరై తిరిగి వెళ్లూ మీడియా కంటపడ్డాడు. దీంతో పాటు అక్కడ తన స్నేహితులు, అభిమానులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చాడు. తలకు నల్లటి బంధన్ కట్టుకొని కనిపించాడు. విమానాశ్రయంలో ధోనీని చూసిన అభిమానులు అతనిని చుట్టుముట్టారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులు వారందర్నీ పక్కకు పంపుతూ ధోనీకి దారిచ్చారు.

మునుపెన్నడూ చూడని గెటప్‌తో కనిస్తున్న ధోనీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆర్మీతో కలిసి పని చేయడం కోసం ధోనీ వెస్టిండీస్ టూర్‌కు దూరమైన విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 15నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే టి20 సిరీస్ పట్ల అంతటా ఆసక్తి నెలకొంది. రిటైర్మెంట్ గురించి ధోనీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అతడి ఆఖరి సిరీస్ దక్షిణాఫ్రికాతోనే కావచ్చని అందరూ భావిస్తున్నారు.

సంబంధిత వర్గం
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.