(Local) Fri, 26 Feb, 2021

టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన మిథాలీ రాజ్

September 03, 2019,   3:25 PM IST
Share on:
టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన మిథాలీ రాజ్

భారత మహిళా జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. వారం రోజుల క్రితం దక్షిణాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించిన మిథాలీ.. జట్టును ప్రకటించడానికి ముందుగానే టీ20ల నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నారు.భారత టీ20 జట్టుకు తొలి కెప్టెన్‌గా 2006లో బాధ్యతలు స్వీకరించిన మిథాలీ.. ఇప్పటివరకు 89 మ్యాచ్‌లు ఆడారు. ఇందులో 32 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. మూడు టీ20 ప్రపంచకప్‌ (2012, 14, 16)లు ఉండటం విశేషం. మొత్తం 2364 పరుగులు చేసి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రీడాకారిణిగా మిథాలీ నిలిచారు.

సంబంధిత వర్గం
బంగ్లాదేశ్ నడ్డి విరిచిన దీపక్ - టీ-20 సిరీస్ భారత ...
బంగ్లాదేశ్ నడ్డి విరిచిన దీపక్ - టీ-20 సిరీస్ భారత ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.