(Local) Sat, 04 Apr, 2020

అకౌంట్‌లో నగదు లేకపోవడంతో షాక్ తిన్న భారత మహిళా క్రికెటర్స్

November 01, 2019,   3:29 PM IST
Share on:
అకౌంట్‌లో నగదు లేకపోవడంతో షాక్ తిన్న భారత మహిళా క్ ...

వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లిన భారత మహిళా క్రికెట్‌ జట్టు సభ్యులకు డైలీ అలెవన్స్‌ (DA) రూపంలో ఇవ్వాల్సిన నగదును ఇవ్వకుండా భారత క్రికెట్‌ ఆపరేషన్స్‌ జిఎం సాబా కరీం అలసత్వం  ప్రదర్శించడం పై బిసిసిఐ సీరియస్‌ అయ్యింది.  భారత క్రికెట్‌ జట్ల ఫైనాన్షియల్‌ వ్యవహారాలన్నీ గత నెల 18వరకు వినోద్‌ రాయ్  నేతృత్వంలోని క్రికెట్‌ పరిపాలన కమిటీ (సిఒఎ) చేసేది. అయితే బిసిసిఐ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో దాన్ని సాబా కరీంకు అప్పజెప్పింది. దీనిపై సెప్టెంబర్‌ 23వ తేదీనే కరీంకు మెయిల్‌ పంపారు. అయితే అక్టోబర్‌ 24వరకు ఫైనాన్షియల్‌ వ్యవహరాలకు సంబంధించి సాబా కరీం ఏమీ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే భారత మహిళా జట్టు…వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లడంతో నగదు సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని వెంటనే బిసిసిఐకి తెలియజేయడంతో కొత్తగా నియమించబడ్డ కార్యవర్గం జోక్యంతో డిఎను ఆగమేఘాలపై బదిలా చేయాల్సి వచ్చింది. కాగా, ఈ వ్యవహారాన్ని చూడాల్సిన సాబా కరీంపై బిసిసిఐ సీరియస్‌ అయ్యింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.