(Local) Mon, 20 Sep, 2021

నేడు భారత్-వెస్టిండీస్ తోలి టి20

August 03, 2019,   11:12 AM IST
Share on:
నేడు భారత్-వెస్టిండీస్ తోలి టి20

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా తొలి టీ20 శనివారం జరగనుంది. కాగా, ఆల్ రౌండర్ రస్సెల్ లేకపోయినా ఎవిన్‌ లూయిస్‌, హెట్‌మయర్‌, నికోలస్‌ పూరన్‌, కీరన్‌ పొలార్డ్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ లాంటి విధ్వంసకారులతో విండీస్‌ బ్యాటింగ్‌ లైనప్ బలంగానే ఉంది. బౌలింగ్‌లో కాట్రెల్‌, నరైన్‌, ఒషాన్‌ థామస్‌‌లు లీడ్ చేయనున్నారు.తొలి టీ20 నుంచే పరుగుల వరద పారేలా కనిపిస్తోంది. ప్రధానంగా టీ-20లో పరుగులే కీలకం. దీన్ని దృష్టిలో పెట్టుకొని... భారత యువ ఆటగాళ్లు... ఫుల్ ప్రాక్టీస్ చేశారు. వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ కుప్పకూలినా... ఈసారి మాత్రం కచ్చితంగా అభిమానుల అంచనాల్ని అందుకుంటామంటోంది. అదే సమయంలో... టీ-20ల్లో మెరుగైన రికార్డ్ ఉన్న విండీస్ కూడా... తొలి మ్యాచ్ నుంచే పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉంది.
వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌లో యువ రక్తంతో బరిలో దిగుతోంది టీమిండియా. బ్యాటింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్, మనీశ్‌ పాండేలను పరీక్షిస్తూ, కీపింగ్‌లో రిషభ్‌ పంత్‌పై పూర్తి బాధ్యత మోపుతూ, బౌలింగ్‌లో నవదీప్‌ సైనీ, రాహుల్‌ చహర్‌లను ప్రయోగిస్తూ కరీబియన్‌ పర్యటనను ప్రారంభించనుంది. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్‌హిల్‌ వేదికగా తొలి టి20 జరుగనుంది. ప్రపంచ కప్‌ నుంచి రిక్తహస్తాలతో తిరిగొచ్చిన నేపథ్యంలో.. అభిమానుల ఆవేదనను మరిపించేందుకు కోహ్లి సేనకు ఇదో అవకాశం. అయితే, పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్లయిన వెస్టిండీస్‌ అనూహ్య ఆటకు పెట్టింది పేరు. ఒంటిచేత్తో ఫలితాన్ని మార్చగల హిట్టర్లున్న ఆ జట్టుపై యువ భారత్‌ ఎలా పైచేయి సాధిస్తుందో చూడాలి.

భారతదేశం: విరాట్ కోహ్లీ (సి), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), క్రునాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, ఖలీక్ అహ్మదర్ నవదీప్ సైని.

వెస్టిండీస్: జాన్ కాంప్‌బెల్, ఎవిన్ లూయిస్, షిమ్రాన్ హెట్మియర్, నికోలస్ పూరన్, కీరోన్ పొలార్డ్, రోవ్మన్ పావెల్, కార్లోస్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), కీమో పాల్, సునీల్ నరైన్, షెల్డన్ కాట్రెల్, ఓషాన్ థామస్, ఆంథోనీ బ్రాంబుల్, ఆండ్రీ రస్సెల్, ఖారీ పియరీ.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.