
వెస్టిండీస్ తో ట్వంటీ20 సిరీస్ గెలిచిన టీమిండియా వన్డేల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. బుధవారం వెస్టిండీస్‌తో జరిగే మూడో, చివరి వన్డేలో విజయమే లక్షంగా భారత్ బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. తొలి వన్డే వర్ష వల్ల రద్దుకాగా, రెండో మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక, సిరీస్‌ను సమం చేయాలంటే విండీస్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఇప్పటికే టి20 సిరీస్‌ను కోల్పోయిన ఆతిథ్య జట్టుకు వన్డేల్లోనూ అదే ఫలితం ఖాయంగా కనిపిస్తోంది.చివరి వన్డేలో విరాట్ సేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉండడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా పోయింది. ఇందులోనూ గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలని భావిస్తోంది. అయితే ఓపెనర్ల వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఈ మ్యాచ్‌లోనైనా ఓపెనర్లు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు విండీస్ కూడా ఈ మ్యాచ్‌ను సవాలుగా తీసుకుంటోంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సర్వం ఒడ్డేందుకు సిద్ధమైంది. నిలకడగా రాణిస్తే భారత్‌ను ఓడించడం విండీస్‌కు కష్టమేమి కాదు. కానీ, సమష్టిగా రాణించడంలో విఫలమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌తో జరిగే ఆఖరి మ్యాచ్ చావోరేవోగా తయారైంది.
టీం ఇండియా :తొలి రెండు వన్డేల్లో శుభారంభం అందించడంలో విఫలమైన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు ఈ మ్యాచ్‌లోనైనా రాణిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఈ సిరీస్‌లో ధావన్ పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. టి20లలో విఫలమైన ధావన్ తొలి రెండు వన్డేల్లో కూడా నిరాశ పరిచాడు. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా నిలకడైన బ్యాటింగ్ కనబరుస్తాడా లేదా అనేది జట్టును కలవరానికి గురిచేస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ధావన్ విజృంభిస్తే భారత్‌కు శుభారంభం ఖాయం. ఇక, వన్డేల్లో ఆశించిన స్థాయిలో రాణించని మరో ఓపెనర్ రోహిత్ కూడా ఈ మ్యాచ్‌లో మెరుగ్గా ఆడక తప్పదు. టి20లో అద్భుతంగా ఆడిన రోహిత్ వన్డేల్లో మాత్రం విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో రాణించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక, కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. కిందటి మ్యాచ్‌లో కోహ్లి అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు కోహ్లిపై భారీ ఆశలు పెట్టుకుంది. కోహ్లి చెలరేగితే ఆపడం విండీస్ బౌలర్లకు చాలా కష్టం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కోహ్లి సొంతం. అతను ఫామ్‌లో ఉండడం టీమిండియాకు ఊరటనిస్తోంది. కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో మరోసారి మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు. అంతేగాక యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ రెండో వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తీవ్ర ఒత్తిడిలో కూడా నిలకడగా రాణించడంతో అతని ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఈ మ్యాచ్‌లో కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు సిద్ధమయ్యాడు. రిషబ్ పంత్ రూపంలో మరో పదునైన అస్త్రం భారత్‌కు అందుబాటులో ఉంది. పంత్ చెలరేగితే బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. ఇదిలావుంటే వరుస అవకాశాలు లభిస్తున్నా కేదార్ జాదవ్ సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు. ఈ మ్యాచ్‌లోనైనా మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. ఇందులో విఫలమైతే జట్టులో చోటు నిలబెట్టుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్‌లతో భారత్ బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్‌లో కూడా టీమిండియాకు ఎదురులేదు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
వెస్టిండీస్ : ఆతిథ్య విండీస్‌కు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పించి మరో మార్గం లేనే లేదు. ఇప్పటికే టి20 సిరీస్‌ను కోల్పోయిన విండీస్ కనీసం వన్డేల్లోనైనా పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్ సమంగా ముగుస్తోంది. లేకుంటే వన్లేల్లోనూ ఓటమి తప్పదు. ఇలాంటి పరిస్థితులో హోల్డర్ సేనపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఒత్తిడిని తట్టుకుని ముందుకు సాగడం కరీబియన్ జట్టుకు కష్టమేనని చెప్పాలి. స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో కూడా ఎలా ఆడుతాడో అంతుబట్టడం లేదు. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గేల్ తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాక ఇతర ఆటగాళ్లు కూడా తమవంతు పాత్ర పోషించక తప్పదు. సమష్టిగా రాణిస్తేనే విండీస్ గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. లేకుంటే మరో ఓటమి ఖాయం.
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్‌పంత్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, కేదార్ జాదవ్, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైని
వెస్టిండీస్: జేసన్ హోల్డర్ (కెప్టెన్), క్రిస్‌గేల్, జాన్ క్యాంప్‌బెల్, ఎవిన్ లూయిస్, షైహోప్, షిమ్రన్ హెట్‌మైయిర్, నికోలస్ పూరన్, రోస్టన్ ఛేజ్, ఫాబియన్ అలెన్, కార్లోస్ బ్రాత్‌వైట్, కీమో పాల్, షెల్డన్ కాట్రెల్, ఒషాన్ థామస్, కీమర్ రోచ్
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
దేశానికి రెండో రాజధాని అవసరం లేదు: కేంద్రం
28 Nov 2019, 9:44 AM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
టెలికాం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
21 Nov 2019, 6:05 PM
-
భారత్ పర్యటించనున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడు
21 Nov 2019, 1:45 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
బంగ్లాదేశ్ క్రికెటర్ కు జరిమానా
29 Nov 2019, 12:36 PM
-
రిషబ్ పంత్ ను హెచ్చరించిన వీవీఎస్ లక్ష్మణ్
28 Nov 2019, 4:02 PM
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
28 Nov 2019, 9:15 AM
-
వెస్టిండీస్ తో డిసెంబర్ లో జరిగే టి20 సంజూ శాంసన్ ...
27 Nov 2019, 3:56 PM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
విజయం దిశగా భారత్..పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్ ...
24 Nov 2019, 11:55 AM
-
సెంచరీ చేసిన కోహ్లీ..కష్టాల్లో బంగ్లా..
23 Nov 2019, 4:02 PM
-
రెండో టెస్ట్ : పటిష్ట స్థితిలో భారత్
23 Nov 2019, 12:33 PM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ లకు టీమిండియా ఎం ...
22 Nov 2019, 3:09 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ మండిపాటు...
20 Nov 2019, 10:26 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM

ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.