(Local) Sat, 24 Oct, 2020

విజయం దిశగా భారత్..పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్లా బ్యాట్స్ మెన్

November 24, 2019,   11:55 AM IST
Share on:
విజయం దిశగా భారత్..పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్ ...

కోల్ కతాలో జరుగుతున్న డేనైట్ టెస్టును టీమిండియా పట్టుబిగించింది. కోహ్లీ అద్భుతమైన శతకంతో అదరగొట్టాడు. దీంతో  డేనైట్ టెస్టులో మొదటి సెంచరీ చేసిన బ్యాట్స్ మెన్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అతనితో పాటు పుజారా, రహానే అర్థశతకాలతో రాణించారు. దీంతో భారత్ భారీ ఆధిక్యం సాధించింది. 347 - 9 దగ్గర ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. 241 పరుగులు ఆధిక్యాన్ని సాధించింది. 
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించేందుకు వచ్చిన బంగ్లాదేశ్ ను మరో సారి ఇషాంత్ శర్మ దెబ్బ కొట్టాడు. నిప్పులు చెరిగే బంతులు వేసి బ్యాట్స్ మెన్ ను క్రీజులో నిలవనివ్వకుండా చేసాడు. బంగ్లా ఖాతా తెరవకుండానే మొదటి వికెట్ కోల్పోయింది. ఇస్లాం ను డక్ అవుట్ చేసి ఇషాంత్ భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. తరువాత కూడా అద్భుతమైన బంతులతో మరో రెండు వికెట్ లు తీసాడు. దీంతో బంగ్లాదేశ్ 13 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది.

ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను సీనియర్లు మహ్మదుల్లా, ముష్ఫికుర్ రహీం తమపై వేసుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే స్కోరును పరిగెత్తించారు. ఈ జోడీని ఔట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మహ్మదుల్లా కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. భారత బౌలర్లను హడలెత్తిస్తూ ముందుకు సాగాడు. రహీం కూడా తన మార్క్ షాట్లతో అలరించాడు. ఇదే క్రమంలో ఐదో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే జోరుమీదున్న మహ్మదుల్లా కీలక సమయంలో రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.

ధాటిగా ఆడిన మహ్మదుల్లా 41 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. మహ్మదుల్లా ఔటైనా రహీం జోరును కొనసాగించాడు. మెహదీ హసన్ అతనికి అండగా నిలిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రహీం 70 బంతుల్లో పది ఫోర్లతో 59 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. మరోవైపు మెహదీ హసన్ (15)ను ఔట్ చేసి ఇషాంత్ మళ్లీ భారత్‌కు పైచేయి అందించాడు. అంతేగాక తైజుల్ ఇస్లాం (11)ను ఉమేశ్ వెనక్కి పంపాడు. దీంతో బంగ్లాదేశ్ 152 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.