(Local) Mon, 17 Feb, 2020

రెండో టెస్ట్ : పటిష్ట స్థితిలో భారత్

November 23, 2019,   12:33 PM IST
Share on:
రెండో టెస్ట్ : పటిష్ట స్థితిలో  భారత్

కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు 106 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా పేసర్ ఇశాంత్ శర్మ 22/5 రాణించడంతో బంగ్లా స్వల్ప స్కోరు మాత్రమే చేయగలిగింది.ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. దాంతో టీమిండియా ఇప్పటికే 68 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. విరాట్ కోహ్లీ(59), రహానే(23) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 

ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా వరుస విరామాల్లో వికెట్స్ నష్టపోవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. టీమిండియా పేసర్లు ఇశాంత్, ఉమేష్, షమీ పదునైన బౌలింగ్ కు బంగ్లా ఆటగాళ్ల నుండి సరైన సమాధానం లేదు. ఇమ్రుల్ కాయెస్ (4)ను ఇశాంత్ పెవిలియన్ చేర్చగా  మోమినుల్ హక్ (0) మహ్మద్ మిథున్(0) ఉమేష్ వేసిన ఒకే ఓవర్ లో వెనుదిరిగారు. దాంతో బంగ్లా 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.మరో 9 పరుగులు జోడించిన తరువాత బంగ్లా క్లాస్ ఆటగాడు రహీం(0) కూడా ఔట్ కావడంతో బంగ్లా 26 పరుగులకే 4 వికెట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మహ్మదుల్లా సహకారంతో షాడ్మాన్ ఇస్లాం కొద్దీ సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. కానీ 29 పరుగులు చేసిన షాడ్మాన్ ను ఉమేష్ పెవిలియన్ చేర్చాడు. లిటన్ దాస్- మహ్మదుల్లా 6వ వికెట్ కు 22 పరుగులు జోడించడంతో బంగ్లా స్కోరు 60 పరుగులకు చేరింద మహ్మదుల్లా(6) కూడా వెనుదిరిగాడు. లంచ్ విరామానికి బంగ్లా 6 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది.  షమి విసిరిన షార్ట్ పిచ్ బంతి  తలకు బలంగా తాకడంతో 24 పరుగులు చేసిన లిటన్ దాస్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.

కాంకషన్ పద్దతిలో  లిటన్ దాస్ కు బదులుగా  మెహిద్ హస్సన్ మిరాజ్ క్రీజ్ లో కి వచ్చాడు. మెహిద్ హస్సన్ మిరాజ్(8) స్వల్ప స్కోరుకే ఔట్ అయ్యాడు. జాయేద్(0) ను షమీ పెవిలియన్ చేర్చడంతో బంగ్లా 106 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా దూకుడుగా ఇన్నింగ్స్ ను ఆరంభించింది. రోహిత్, మయాంక్ కేవలం 4.4 ఓవర్లలోనే 26 పరుగులు జోడించింది. ఈ దశలో మయాంక్(14)ను అమీన్ బోల్తా కొట్టించాడు.మరో 17 పరుగుల తరువాత రోహిత్ శర్మ(21) కూడా వెనుదిరగడంతో టీమిండియా 43 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.  ఆ తరుణంలో చతేశ్వర పుజారా-విరాట్‌ కోహ్లి జోడి ఇన్నింగ్స్‌ ను ఆదుకున్నారు. క్రీజులో నికదొక్కుకునేంత వరకు నిదానంగా ఆడిన ఈ జోడి ఆ తరువాత వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో పుజారా 93 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ చేసిన వెంటనే పుజారా(55)ని  ఎబాదత్‌ ఔట్ చేశాడు.

పుజారా-కోహ్లీ జోడి మూడో వికెట్ కు 94 పరుగులు జోడించారు. ఆ తరువాత రహానే సహకారంతో కోహ్లీ జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. ఈ క్రమంలో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. ఆట ముగిసే సమయానికి కోహ్లి(59 బ్యాటింగ్‌) రహానే( 23 బ్యాటింగ్‌)లు క్రీజ్‌లో ఉన్నారు. చేతిలో ఇంకా 7 వికెట్లు ఉండటంతో టీమిండియా తొలి టెస్ట్ రెండో రోజు భారీ స్కోరు చేయడం ఖాయంగా కనబడుతోంది. 

 

 

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.