(Local) Mon, 09 Dec, 2019

రెండో టి20 కి ముమ్మర ప్రాక్టీస్ చేస్తున్న భారత్

November 06, 2019,   4:37 PM IST
Share on:
రెండో టి20 కి ముమ్మర ప్రాక్టీస్ చేస్తున్న భారత్

తొలి టి20లో బాంగ్లాదేశ్ తో  ఓటమి పాలైన టీమిండియాకు గురువారం రాజ్‌కోట్ వేదికగా జరిగే రెండో మ్యాచ్ సవాలుగా మారింది. సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఆటగాళ్లు  సాధనలో నిమగ్నమయ్యారు. మంగళవారం క్రికెటర్లు ముమ్మర ప్రాక్టీస్ చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మతో సహా జట్టు సభ్యులందరూ సాధనలో పాల్గొన్నారు. కొందరు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా, మరికొందరూ బౌలింగ్‌పై దృష్టి పెట్టారు.

మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో పరిస్థితి మాములుకు చేరుకుంటుందనే నమ్మకంతో నిర్వాహకులు ఉన్నారు. మ్యాచ్ జరుగుతుందా లేదా అని విషయాన్ని ప్రక్కన బెడితే ఆటగాళ్లు మాత్రం సాధనపై దృష్టి పెట్టారు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో భారత్ ఉంది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. రోహిత్‌తో సహా అందరూ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. బౌలింగ్‌లో చాహల్, సుందర్‌లు మాత్రమే సత్తా చాటారు. ఖలీల్ భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక, తొలి మ్యాచ్‌లో జరిగిన పొరపాట్లకు ఈసారి తావులేకుండా చూడాలనే లక్షంతో భారత్ కనిపిస్తోంది.

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లోపాలను సరిసిద్దరుకోవడంపై ఆటగాళ్లు దృష్టి సారించారు. ప్రధాన కోచ్ రవిశాస్త్రితో పాటు సహచర సిబ్బంది ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇస్తూ వారిని మ్యాచ్‌కు సన్నద్ధం చేస్తున్నారు. కాగా, తొలి మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయం సాధించిన బంగ్లాదేశ్ రెండో టి20కి ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది. ఈసారి కూడా గెలుపుపై కన్నేసింది. దీంతో భారత్‌పై ఒత్తిడి నెలకొంది. ఒత్తిడిని తట్టుకుని ముందుకు సాగాలనే లక్షంతో భారత్ కనిపిస్తోంది. ఇందుకోసం సాధనను ముమ్మరం చేసింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.