(Local) Sat, 04 Apr, 2020

ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు పేసర్లకే..!

November 22, 2019,   3:05 PM IST
Share on:
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...

బాంగ్లాదేశ్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. భారత బౌలర్లు బ్యాట్స్ మెన్ మెన్ ను క్రీజులో నిలవనివ్వట్లేదు. వరుసగా ముగ్గుర్ని డకౌట్ చేసిన భారత బౌలర్లు మరో వికెట్ తీసి అభిమానుల్లో జోష్ ని నింపారు. ఇన్నింగ్స్ ఆరంభించేందుకు వచ్చిన బంగ్లాకు ఆదిలోనే షాక్ తగిలింది. కేయిస్ ను అవుట్ చేసి ఇషాంత్ భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. పింక్ బాల్ తో ఆడుతున్న మ్యాచ్ లో ఇషాంత్ మొదటి వికెట్ సాధించాడు. 
తరువాత ఒకే ఓవర్ లో ఉమేష్ రెండు వికెట్లు తీసి బంగ్లా ను గట్టి దెబ్బ కొట్టాడు. రోహిత్ పట్టిన అద్భుత క్యాచ్ కు కెప్టెన్ మోనిముల్ పెవిలియన్ చేరితే, మొహమ్మద్ మిథున్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో బంగ్లా కష్టాల్లో పడింది. ఆ తరువాత వచ్చిన రహీమ్ షమీ వేసిన అద్భుతమైన బంతికి పెవిలియన్ చేరాడు. మోనిముల్, మిథున్, రహీమ్ ఖాతా తెరవకుండా సున్నా పరుగులకే పెవిలియన్ చేరడం గమనార్హం. భారత బౌలర్ల దాటికి బంగ్లా బ్యాట్స్ మెన్ పెవిలియన్ కి క్యూ కడుతున్నారు. ఉమేష్ షాడమాన్ ఇస్లాం వికెట్ తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు. తరువాత ఇషాంత్ మహమ్మదుల్లా వికెట్ తీసి కష్టాల్లో ఉన్న బంగ్లాను మరింత కష్టాల్లోకి నెట్టాడు.ప్రస్తుతం బాంగ్లాదేశ్ 22 ఓవర్లలో 73/6 రన్స్ తో ఆడుతోంది .

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.