(Local) Sat, 06 Jun, 2020

బంగ్లా గెలిస్తేనే.. కివీస్ సెమీస్‌కు

July 04, 2019,   12:00 AM IST
Share on:
బంగ్లా గెలిస్తేనే.. కివీస్ సెమీస్‌కు

సెమీస్‌కు చేరిన మూడో జట్టేదో తేలిపోయింది. న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్‌ బెర్తును ఖరారు చేసుకుంది. చెస్టర్‌ లీ స్ట్రీట్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 119 పరుగుల తేడాతో కివీస్‌పై ఆతిథ్య దేశం విజయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లిష్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ 186 పరుగులకే కుప్పకూలింది. టామ్‌ లాథమ్‌(57) ఒక్కడే అర్ధశతకంతో రాణించాడు. కివీస్‌ బ్యాట్స్‌మన్లలో మార్టిన్‌ గప్తిల్‌ 8, నికోలస్‌ డకౌట్‌, కేన్‌ విలియ్సన్‌ 27, రాస్‌ టేలర్‌ 28, నీషమ్‌ 19, గ్రాండ్‌హోమ్‌ 3, శాంట్నర్‌ 12, సౌథీ 4, హెన్రీ 7 పరుగులు చేశారు.

ఈ ఓటమితో కివీస్‌ సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. శుక్రవారం జరిగే పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ ఫలితంపై న్యూజిలాండ్‌ భవితవ్యం ఆధారపడి ఉంది. ఆ మ్యాచ్‌లో బంగ్లా గెలిచి పాక్‌ ఓడిపోతే కివీస్‌ సెమీస్‌కు చేరుతుంది. ఒక వేళ పాకిస్థాన్‌ గెలిస్తే మాత్రం రన్‌రేట్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అప్పుడు ఏ టీమ్‌కు రన్‌రేట్‌ ఎక్కువ ఉంటే దానికే సెమీస్‌లో చోటు లభిస్తుంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.