(Local) Tue, 20 Oct, 2020

ఫేస్‌బుక్‌కు ఐసీసీ డిజిటల్‌ హక్కులు

September 27, 2019,   3:20 PM IST
Share on:
ఫేస్‌బుక్‌కు ఐసీసీ డిజిటల్‌ హక్కులు

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)తో ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్‌ జత కట్టింది. భారత ఉపఖండంలో జరిగే క్రికెట్‌ మ్యాచ్‌లకు సంబంధించిన డిజిటల్‌ కంటెంట్‌ హక్కులను ఫేస్‌బుక్‌ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఐసీసీ గురువారం ధ్రువీకరించింది. డిజిటల్‌ హక్కులతో పాటు మ్యాచ్‌ పున:ప్రసారాలు, క్రికెట్‌కు సంబంధించిన కథనాలను ఇకనుంచి ఫేస్‌బుక్‌ ప్రేక్షకులకు అందించనుంది. 2023 వరకు ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. ‘క్రికెట్‌ ప్రపంచంలోకి ఫేస్‌బుక్‌ను ఆహ్వానిస్తున్నాం . ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తోన్న ఫేస్‌బుక్‌ ద్వారా క్రికెట్‌కు మరింత లబ్ధి చేకూరుతుంది’ అని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మను సాహ్ని అన్నారు. ఐసీసీతో భాగస్వామ్యంపై ఫేస్‌బుక్‌ హర్షం వ్యక్తం చేసింది.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.