ఆత్మవిశ్వాసంతో భారత్ - విండీస్‌కు సవాల్, నేటి నుంచి తొలి టెస్టు

అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రవేశ పెట్టిన టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్, వెస్టిండీస్‌లు తమ మొదటి టెస్ట్ మ్యాచ్‌ను అంటిగ్వాలో ఆడనుంది . ఇరు జట్లకు ఈ చాంపియన్‌షిప్‌లో ఇదే మొదటి మ్యాచ్ కావడం విశేషం. ఇటీవల ముగిసిన ట్వంటీ20, వన్డే సిరీస్‌లను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో టెస్టు సమరంలో భారత జట్టు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఇక, ఇప్పటికే రెండు సిరీస్‌లను చేజార్చుకున్న ఆతిథ్య వెస్టిండీస్ జట్టు కనీసం టెస్టుల్లోనైనా మెరుగైన ఆటను కనబరచాలని భావిస్తోంది.
అయితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న ప్రపంచ నంబర్‌వన్ భారత్‌ను ఓడించడం విండీస్‌కు అంత తేలిక కాదనే చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లు, బ్యాట్స్‌మెన్ టీమిండియాలో ఉన్నారు. దీంతో ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లి సేన ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఒకప్పుడూ వెస్టిండీస్ గడ్డపై పోరు అంటేనే విదేశి జట్లు చేతులెత్తేసేవి. అయితే రెండు దశాబ్దాలుగా విండీస్ క్రికెట్ తిరోగమనంలో ప్రయాణిస్తోంది. చివరికి శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి చిన్న జట్ల చేతుల్లోనూ సొంత గడ్డపై పరాజయాలు చవిచూస్తోంది. గతంలో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన కరీబియన్ జట్టు ప్రస్తుతం వరుస ఓటములతో కుదేలైంది. చివరికి ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించలేని దుస్థితికి పడిపోయింది. క్రికెట్ బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య జరుగుతున్న అంతర్గత పోరుతో క్రికెట్ పతనావస్థకు చేరింది.
ఇటీవల కాలంలో హెట్మెయిర్, షాయ్ హోప్ వంటి యువ ఆటగాళ్లు రావడంతో జట్టు కాస్త బలంగా మారింది. ఎటువంటి బౌలింగ్‌నైనా వీరు దీటుగా ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు హోల్డర్ కెప్టెన్‌గా ఎంతో రాటుదేలాడు. పరిస్థితి ఎలా ఉన్నా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈసారి కూడా హోల్డర్‌పైనే విండీస్ భారీ ఆశలు పెట్టుకుంది.
భారత్ : వెస్టిండీస్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్లు లోకేశ్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లకు సవాలుగా తయారైంది. ఈ మ్యాచ్‌లో వీరిద్దరే ఓపెనర్లుగా దిగే అవకాశం ఉంది. కాగా, కొంతకాలంగా రాహుల్ అంతంత మాత్రం ఫామ్‌తో నిరాశ పరుస్తున్నాడు. ఎన్ని అవకాశాలు లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు. అడపాదడపా కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నా అతనిలో నిలకడ కనిపించడం లేదు. ఈసారైనా రాహుల్ తన బ్యాట్‌కు పని చెబుతాడా లేదా అనేది ఆసక్తిగా మారింది.తనదైన రోజు ఎంతటి పెద్ద బౌలర్‌కైనా చుక్కలు చూపించే సత్తా రాహుల్‌కు ఉంది. కొత్త ఆటగాడు మయాంక్ అగర్వాల్ ఎలా ఆడుతాడో ఇప్పుడే చెప్పలేం. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు. ఈ నేపథ్యంలో మయాంక్‌ను ఆడిస్తారా లేక తెలుగు ఆటగాడు హనుమ విహారికి ఛాన్స్ ఇస్తారా అనేది ఇంకా తేలలేదు.గతంలో ఓపెనర్‌గా దిగిన విహారి ఆశించిన స్థాయిలో ఆడక పోవడమే దీనికి ప్రధాన కారణం. మిడిలార్డర్లో నిలకడగా ఆడే విహారి ఓపెనర్‌గా మాత్రం పెద్దగా రాణించలేక పోయాడు. దీంతో ఈసారి మయాంక్‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కడం ఖాయమనే చెప్పాలి.
ఇక, కెప్టెన్ విరాట్ కోహ్లి వన్డే సిరీస్‌లో వరుసగా సెంచరీలతో చెలరేగి పోయాడు. దీంతో అతని ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. టెస్టుల్లోనూ అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి చెలరేగితే విండీస్ బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇప్పటికే కోహ్లి టెస్టుల్లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. అయితే అతనికి స్టీవ్ స్మిత్ రూపంలో గట్టి పోటీ నెలకొంది. టాప్ ర్యాంక్‌ను కాపాడుకోవాలంటే కోహ్లి విండీస్‌పై మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. యాషెస్ సిరీస్‌లో స్మిత్ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. విండీస్‌పై రాణిస్తే కోహ్లి టాప్ ర్యాంక్ మరింత పదిలమవుతోంది. దీంతో ఈ మ్యాచ్‌ను కోహ్లి సవాలుగా తీసుకున్నాడు. మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలువాలని భావిస్తున్నాడు.
మరోవైపు తుది జట్టులో స్థానం కోసం స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, అజింక్య రహానెల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కోహ్లి ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలని భావిస్తే వీరిలో ఒకరికే స్థానం దక్కుతోంది. వన్డేల్లో రోహిత్, టెస్టుల్లో రహానె జట్టుకు వైస్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వీరిలో ఎవరిని పక్కన బెట్టాలన్నా కోహ్లికి కష్టమే. కాగా, ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే మాత్రం రోహిత్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. కానీ, టెస్టుల్లో మెరుగైన రికార్డును కలిగిన రహానెను పక్కన బెట్టడం అనుకున్నంత తేలిక కాదు. రహానె ఒకసారి ఫామ్‌లోకి వచ్చాడంటే అతన్ని ఆపడం చాలా కష్టం. ప్రాక్టీస్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ కొట్టడం ద్వారా రహానె టచ్‌లోకి వచ్చాడు.
రోహిత్ కూడా ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో రాణించడంతో ఎవరిని తుది జట్టులో తీసుకోవాలో కోహ్లికి కష్టంగా తయారైంది. అయితే వీరిద్దరిని కూడా తొలి టెస్టులో ఆడించేందుకే కోహ్లి ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. మరోవైపు నయావాల్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా సాధన మ్యాచ్‌లో శతకంతో మెరవడం జట్టుకు ఊరట కలిగిస్తోంది. ఆరు నెలక సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా తొలిసారి టెస్టుల్లో బరిలోకి దిగుతోంది. ఇతర ఆటగాళ్లకు ఐపిఎల్ తదితర టోర్నీల ద్వారా ప్రాక్టీస్ లభించినా పుజారా మాత్రం చాలా కాలంగా పోటీలకు దూరంగా ఉండక తప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఎలా ఆడుతాడో అని అందరు కాస్త కలవరానికి గురయ్యారు. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా పుజారా అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టాడు.
వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా టెస్టుల్లో బాగానే ఆడుతున్నాడు. కిందటి సిరీస్‌లలో పంత్ ఇటు కీపర్‌గా, అటు బ్యాట్స్‌మన్‌గా మెరుగ్గా రాణించాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. అంతేగాక రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. దీనికి తోడు బౌలింగ్‌లో కూడా భారత్‌కు ఎదురులేదనే చెప్పాలి. ఇషాంత్ శర్మ, బుమ్రా, షమి, జడేజా, అశ్విన్‌లతో బౌలింగ్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇషాంత్ సత్తా చాటడం కూడా కలిసి వచ్చే అంశమే. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న టీమిండియా మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఇక, ఆతిథ్య వెస్టిండీస్ ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఎంత వరకు పోటీ ఇస్తుందో వేచి చూడాల్సిందే.
జట్ల వివరాలు:
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె, చటేశ్వర్ పుజారా, మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, హనుమ విహారి, కెఎల్.రాహుల్, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, బుమ్రా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్.
వెస్టిండీస్: జాసన్ హోల్డర్ (కెప్టెన్), బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, షమర్థ్ బ్రూక్స్, జాన్ క్యాంప్‌బెల్, రోస్టన్ ఛేస్, రకీం కార్న్‌వల్, షేన్ డోరిచ్, షనాన్ గాబ్రియల్, షిమ్రోన్ హెట్మెయిర్, షాయ్ హోప్, కీమర్ రోచ్.
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
దేశానికి రెండో రాజధాని అవసరం లేదు: కేంద్రం
28 Nov 2019, 9:44 AM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
టెలికాం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
21 Nov 2019, 6:05 PM
-
భారత్ పర్యటించనున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడు
21 Nov 2019, 1:45 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
బంగ్లాదేశ్ క్రికెటర్ కు జరిమానా
29 Nov 2019, 12:36 PM
-
రిషబ్ పంత్ ను హెచ్చరించిన వీవీఎస్ లక్ష్మణ్
28 Nov 2019, 4:02 PM
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
28 Nov 2019, 9:15 AM
-
వెస్టిండీస్ తో డిసెంబర్ లో జరిగే టి20 సంజూ శాంసన్ ...
27 Nov 2019, 3:56 PM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
విజయం దిశగా భారత్..పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్ ...
24 Nov 2019, 11:55 AM
-
సెంచరీ చేసిన కోహ్లీ..కష్టాల్లో బంగ్లా..
23 Nov 2019, 4:02 PM
-
రెండో టెస్ట్ : పటిష్ట స్థితిలో భారత్
23 Nov 2019, 12:33 PM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ లకు టీమిండియా ఎం ...
22 Nov 2019, 3:09 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ మండిపాటు...
20 Nov 2019, 10:26 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM

ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.