(Local) Mon, 01 Jun, 2020

ప్రపంచ కప్ సెమీఫైనల్ ఓటమిని జీర్ణించుకోవడం కష్టం -కోహ్లీ

August 03, 2019,   2:53 PM IST
Share on:
ప్రపంచ కప్ సెమీఫైనల్ ఓటమిని జీర్ణించుకోవడం కష్టం - ...

వెస్టిండీస్‌తో తొలి టీ20కి ముందు కోహ్లీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా  ప్రపంచకప్‌సెమీఫైనల్ లో టీమిండియా నిష్క్రమణ పై స్పందించాడు. న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి తర్వాత కొన్ని రోజులు దారుణంగా గడిచాయని, ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా మారిందని చెప్పాడు. ప్రపంచకప్‌ ముగిసేవరకూ నిద్రలేచిన ప్రతీ ఉదయం ఆ పరాభవమే గుర్తొచ్చేదని, ఆ తర్వాత దైనందిక కార్యక్రమాల్లో పడి ఆ ఓటమిని  మర్చిపోవడానికి ప్రయత్నించామని చెప్పాడు. తాము అంతర్జాతీయ ఆటగాళ్లమని, జరిగిన వాటికి చింతించకుండా ముందుకుసాగడంపై దృష్టిసారించామని తెలిపాడు.అంతేకాక వెస్టిండీస్‌ పర్యటనకు ధోనీ లేకపోవడంపై స్పందిస్తూ అతడి అనుభవం టీమిండియాకి ఎంతో అవసరమని పేర్కొన్నాడు. ధోనీ లేని లోటు యువ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషబ్‌పంత్‌కు చక్కటి అవకాశమని కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు. మిడిలార్డర్‌లో పంత్‌ రాణించాలని, అతడికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

సంబంధిత వర్గం
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.