(Local) Mon, 12 Apr, 2021

ప్రతిమ్యాచ్‌ కాపీ, పేస్ట్‌లా సాగింది -డుప్లెసిస్‌ సంచలన వ్యాఖ్యలు

October 28, 2019,   1:22 PM IST
Share on:
ప్రతిమ్యాచ్‌ కాపీ, పేస్ట్‌లా సాగింది -డుప్లెసిస్‌  ...

ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. బ్యాట్స్‌మన్‌, బౌలర్లు సమిష్టి ప్రదర్శన చేయడంతో.. మూడు టెస్టులలో రెండు టెస్టులు ఇన్నింగ్స్‌ పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘోర పరాభవాన్ని చవిచూసింది. అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఓటమికి కొత్త కారణం చెబుతూ.. టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనను కించపరిచాడు. చీకటిగా ఉన్న సమయంలో భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి.. ఆపై మూడు వికెట్లు తీసిందని అన్నాడు. ప్రతిమ్యాచ్‌ కాపీ, పేస్ట్‌లా సాగిందని చులకనగా మాట్లాడాడు.

డుప్లెసిస్‌ మాట్లాడుతూ... 'ప్రతి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచేది. తొలుత బ్యాటింగ్‌ చేసి 500లకు పైగా పరుగులు సాధించేది. చీకటి పడుతుండగా ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసి.. చీకట్లో మమ్మల్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించి మూడు వికెట్లు పడగొట్టేది. దీంతో మూడో రోజు ఆట ఒత్తిడితో మేము కొనసాగించాల్సి వచ్చేది. ప్రతి టెస్టులోనూ ఇదే తంతు. కాపీ, పేస్ట్‌లా సాగిపోయింది' అని అన్నాడు.

డుప్లెసిస్‌ వ్యాఖ్యలపై భారత అభిమానులు ట్విటర్‌లో మండిపడుతున్నారు. 'ఓటమికి సిల్లీ కారణాలు చెప్పకుండా గెలవడానికి ప్రయత్నించు' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'ఇలాంటి మానసిక స్థితి ఉన్న వ్యక్తి జట్టుకు కెప్టెన్‌గా ఉంటే దక్షిణాఫ్రికా ఎప్పటికీ తేరుకోలేదు అని మరో అభిమాని కామెంట్ చేసాడు. 'జట్టులో సీనియర్‌ ఆటగాడిగా ఉన్న నువ్వు.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి నీపై ఉన్న అభిమానాన్ని పోగొట్టుకుంటున్నావు' అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.